| Daily భారత్
Logo




"బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డ్" అందుకున్న పున్నంచందర్

News

Posted on 2025-05-11 09:35:41

Share: Share


"బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డ్" అందుకున్న పున్నంచందర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్ల "బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డ్ – 2025" ను ఈరోజు హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి మరియు మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం చేతుల మీదుగా అందుకున్నారు. మానసిక ఆరోగ్యంపై అంకితభావంతో పని చేస్తూ, అనేక మంది వ్యక్తులకు జీవిత మార్గదర్శకత్వం మరియు ఆత్మహత్యల నివారణకు కృషి చేసినందుకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయబడింది.

ఈ అవార్డు ప్రముఖ సంస్థ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ వారు వార్షికంగా దేశవ్యాప్తంగా విశిష్ట సేవలందించిన మానసిక నిపుణులకు అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారం అని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొతుకూరి  రామ్ చందర్ తెలిపారు.

సైకాలజిస్ట్ పున్నంచందర్ గత పదిహేను ఏండ్లుగా పలు మానసిక సమస్యల పరిష్కారానికి నూతన పద్ధతులను వినియోగిస్తూ, వ్యక్తిగత కౌన్సిలింగ్, వర్క్‌షాపులు మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా అనేకమందికి స్ఫూర్తిగా నిలిచారు అని తెలిపారు.

ఈ సందర్భంలో సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ, "ఈ అవార్డు నాకు ఎంతో గొప్ప గౌరవం మరియు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. మానసిక ఆరోగ్యంపై సమాజంలో అవగాహన పెంచడానికి నా సేవలు కొనసాగిస్తాను" అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మోత్కూరు రామచందర్, సైకాలజిస్టులు పాల్గొన్నారు.

పున్నంచందర్ కు అవార్డ్ రావడం పట్ల సైకాలజిస్ట్ లు వై.ఆంజనేయులు, ఏ.ఈశ్వర్, శ్రీనివాస్, అయ్యప్ప రాము, తిరుమల పలువురు అభినందించారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >