| Daily భారత్
Logo




చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

News

Posted on 2026-03-07 21:29:26

Share: Share


చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ప్రజలందరి ఆరోగ్య దృష్టిని కాపాడే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం అందరికీ ఓ వరం లాంటిది. అరుదైన ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని, మీ కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘ కమిటీ సభ్యులు కోరారు. హైదరాబాద్ లోని శంకర్ శంకర్ కంటి ఆస్పత్రి సౌజన్యంతొ 8వ తేదిన ఆదివారం  చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పట్టణంలోని రైతు బజార్ పోచమ్మ తల్లి గుడి వద్ద ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని కొత్తగూడెం పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా గతంలో విడతల వారీగా ఏర్పాటు శిబిరాల్లో  వేలాది మంది కంటి పరీక్షలు చేసుకోగా ఇప్పటి వరకు 600 మందికి పైగా వ్యక్తులకు కంటి ఆపరేషన్ లు చేయించినట్టు వారు వివరించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతు నిరుపేదలకు ఇలాంటి క్యాంపుల ద్వారా ఉచిత వైద్యం అందించడం తమ బాధ్యత అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవ సంఘం రేఖ రాజశేఖర్, గునిగంటి చందర్, నమ్మి జగదీష్, పెద్దిరెడ్డి సుంకు కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Image 1

రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడవ సారి ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం

Posted On 2026-06-04 18:52:18

Readmore >
Image 1

విద్యార్థుల నమోదు 10 శాతం పెంచేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-04 18:50:58

Readmore >
Image 1

బస్వాపూర్ గ్రామపంచాయతీ లో స్వచ్ఛ కామారెడ్డి... స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామసభ

Posted On 2026-06-04 18:49:52

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్..

Posted On 2026-06-04 16:10:32

Readmore >
Image 1

హైదరాబాద్ : అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం..

Posted On 2026-06-04 16:02:10

Readmore >
Image 1

కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారే దిశగా అడుగులు వేస్తుంది.. ఇది తెలంగాణకే గర్వకారణం

Posted On 2026-06-04 15:58:25

Readmore >
Image 1

ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన అజెండా : మద్దిశెట్టి సామేలు

Posted On 2026-06-04 15:52:23

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-04 12:50:14

Readmore >
Image 1

రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి... డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు!

Posted On 2026-06-04 12:18:53

Readmore >
Image 1

సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రజలే భాగస్వాములు కావాలి : ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-06-04 12:14:22

Readmore >