డైలీ భారత్, బీబీపేట :బీబీపేట మండల కేంద్రంలో మినీ బస్ స్టాండ్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త కొరివి నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం ఆయన విడుదల చేసిన ప్రెస్ నోట్ లో.. బీబీపేట మీదుగా దుబ్బాక, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, రామాయంపేట తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయని, మండలంలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు.
గతంలో నిర్మించిన బస్ స్టాండ్ ను ఆధునీకరించి ప్రతి బస్సుకు ప్రత్యేక ప్లాట్ ఫామ్, నంబర్ కేటాయించాలని, బస్సులు క్రమపద్ధతిలో నిలిచేలా చర్యలు తీసుకుంటే విద్యార్థులు, మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు తగ్గుతాయన్నారు.
బీబీపేటకు రవాణా పరంగా ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని, పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే నిధులు మంజూరు చేయకపోతే ప్రజల తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.