| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేతన సవరణ కోసం సిరిసిల్లలో వ్యాయామ ఉపాధ్యాయుల వినతి! న్యాయం చేయాలని డిమాండ్!

వేతన సవరణ కోసం సిరిసిల్లలో వ్యాయామ ఉపాధ్యాయుల వినతి! న్యాయం చేయాలని డిమాండ్!

డైలీ భారత్, సిరిసిల్ల: ఈ రోజు సిరిసిల్లలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన TGPETA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పాపన్నగారి నాగరాజు గౌడ్ ను TGPETA రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది!

ముఖ్యంగా KGBV వ్యాయామ ఉపాధ్యాయులకు CRTలతో సమానంగా వేతన సవరణ చేయడంతో పాటు, మోడల్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులకు G.O. నం 252 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న విధంగా వేతన సవరణ కల్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది!

ఈ సమస్యలను రాష్ట్ర స్థాయి సంబంధిత ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి, వ్యాయామ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరడం జరిగింది!

ఈ కార్యక్రమంలో TGPETA రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ అధ్యక్షులు దుప్పటి రవికుమార్, అధ్యక్షులు తడకల సురేష్, ప్రధాన కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్, కోశాధికారి తడకల శ్యాంసుందర్, జిల్లా ఉపాధ్యక్షులు సాంద్రకరి రాజు, జిల్లా కార్యదర్శులు బండిపెల్లి పరశురాం, దాని నరేష్ పాల్గొన్నారు!

#DailyBharath #RajannaSircilla #TGPETA #PETeachers #Telangana

Previous ఆపరేషన్ నిమిత్తం సకాలంలో ఓ పాజిటివ్ రక్తం అందజేత! రక్తదానంతో ఆదర్శంగా ఓరుగంటి మల్లేష్!
Next కామారెడ్డిలో అన్నపూర్ణ రథం ఘనంగా ప్రారంభం! పేదలకు ఆహారం అందించడమే లక్ష్యం!
ADVERTISEMENT