| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సౌధ కంపెనీ నియంతృత్వ వైఖరి సరైంది కాదు... ఓబీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సౌధ కంపెనీ నియంతృత్వ వైఖరి సరైంది కాదు... ఓబీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సౌధ కంపెనీ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న నియంతృత్వ వైఖరి సరైంది కాదని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓబీ కార్మికుల 6వ రోజు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కార్మిక చట్టాల్లో కార్మికులకు కల్పించిన న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని,కార్మికులు వారి కనీస వేతనాల కోసం నిరసన తెలియజేసినందుకు నలుగురు కార్మికులను అకారణంగా తొలగించడం సరైంది కాదని వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.సౌధ యాజమాన్యం కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి చోరువచూపాలని అలాకాకుండా నియంతల అణచివేయాలని చూస్తున్నారని,పోరాటాల పురిటిగడ్డ కొత్తగూడెం కు ఎక్కడి నుంచో వచ్చి కాంట్రాక్టులు దక్కించుకుని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వారిపై పెత్తనం చెలాయిస్తామంటే,వారి హక్కులను హరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఐదు శాతం కూడా లేని అగ్రవర్ణాల వారు మన ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి,పలుకుబడి సంపాదించుకొని కాంట్రాక్టులు దక్కించుకుంటే 90 శాతం ఉన్న బహుజనులు ఇంకా హక్కుల కోసం పోరాడే పరిస్థితి ఉందంటే,మనం ఓటు వేసేటప్పుడు సరైన ఆలోచన లేకుండా అగ్రకులాలకు ఓట్లు వేసి అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవడమే కారణమని,బహుజనులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్లి కాంట్రాక్టులు దక్కించుకుంటేనే మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉండదన్నారు.కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనియెడల,భవిష్యత్తులో కార్మికులు జరిపే పోరాటాలకు జేబీపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు.

ఈకార్యక్రమంలో *వాడపల్లి రమేష్,బాచి,జెట్టి మోహన్,మార్షల్ శీను, బూరుగు సతీష్,నాగయ్య,పి.ఎల్ సురేష్,ఎస్.కె.హైమద్ రఘు,కోటి,రామచందర్ తదితరులు పాల్గొన్నారు

Previous ఈనెల 16న కలెక్టరేట్ లో బాలల ప్రజావాణి
Next జాతీయ సేవా రత్న పురస్కారాలతో మెరిసిన గోపతండ సమాజ సేవకులు! బొకేలు వద్దు మొక్కలే ముద్దు!
ADVERTISEMENT