డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు (32) కు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమని తెలియజేయగానే వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి ఓరుగంటి మల్లేష్ సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారు!
ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్త సంబంధం లేకపోయినా తోటి వారికి రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడాలని మంచి ఉద్దేశంతో ఎంత దూరమైనా వెళ్లి రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న ఓరుగంటి మల్లేష్ కు అభినందనలను కృతజ్ఞతలను తెలియజేయడం జరిగిందని అన్నారు!
ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు! యువత రక్తదానానికి ముందుకు రావాలని రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని అన్నారు!
ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్ కు తెలియజేయాలని అన్నారు!
#DailyBharath #Kamareddy #BloodDonation #OPositive #DrBalu