డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఒకటో టౌన్ పోలీస్టే స్టేషన్ పరిధిలోని కొజ్జా కాలానికి చెందిన సహజత్ ఖాన్(40) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గొంతుకు ఉరివేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెనుక వివాహేతర సంబంధాల వ్యవహారం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. భార్య, ఆమె ప్రియుడు కలిసి సహజత్ ఖాన్ను హతమార్చి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు సహజత్ ఖాన్కు నలుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు విచారణలో తేలనుంది .
News
వ్యక్తి దారుణ అనుమానాస్పద హత్య వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందా...?