డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట అటవీ శాఖ పరిధిలో వన్యప్రాణుల వేట, మాంసం అక్రమ రవాణా మరియు విక్రయాలపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు!
అప్పారావుపేట గ్రామ సమీపంలో ఒక వ్యక్తి యాక్టివా ద్విచక్ర వాహనంపై వన్యప్రాణి మాంసాన్ని అక్రమంగా తరలిస్తుండగా అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు!
సదరు వ్యక్తి శ్రీను దమ్మపేట అని విచారణలో తేలింది! సాయి అనే వ్యక్తి తనకు వన్యప్రాణి మాంసాన్ని విక్రయించడానికి ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడించాడు!
ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు!
నిందితుడిని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, కొత్తగూడెం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది! నిందితుడిని సత్తుపల్లి సబ్ జైలుకు తరలించారు!
వన్యప్రాణులను వేటాడటం, వాటి మాంసాన్ని కలిగి ఉండటం, రవాణా చేయడం లేదా విక్రయించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం శిక్షార్హమైన నేరాలు!
వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు అటవీ శాఖకు సహకరించాలని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని అధికారులు కోరారు! ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు!
#DailyBharath #BhadradriKothagudem #Dummapeta #Wildlife #ForestDepartment