డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: గుంటూరులో కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ వార్షికోత్సవం 2026 వేడుకల్లో వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న పలువురికి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు!
ఈ సందర్భంగా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సభ్యులు సుజాతనగర్ మండలం సర్వారం గ్రామం గోపతండకు చెందిన ఉపాధ్యాయుడు మొక్కల బాలు, విజయ బ్లడ్ బ్యాంక్ భద్రాద్రి జిల్లా ఇన్ చార్జి బి వినోద్ కుమార్ లకు జాతీయ సేవా రత్న పురస్కారాలు అందజేశారు!
బొకేలు వద్దు మొక్కలే ముద్దు అంటూ పర్యావరణ పరిరక్షణకు బాలు కృషి!
బాలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతూ, బొకేలకు బదులుగా మొక్కలను బహూకరించాలని ప్రచారం చేస్తున్నారు!
ఆపదలో ఉన్నవారికి రక్తదాతలను ఏర్పాటు చేస్తూ అండగా వినోద్ కుమార్!
మరోవైపు వినోద్ కుమార్ అత్యవసర సమయాల్లో రక్తదాతలను సమకూరుస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు!
వీరి సేవలను గుర్తించి పురస్కారాలు అందజేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు! ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు!
#DailyBharath #Guntur #KBRFoundation #SevaRatna #BhadradriKothagudem