డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సేవలందించాలనే గొప్ప సంకల్పంతో జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ రథాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తల్లి గడ్డం విజయలక్ష్మి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు!
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జీసీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రారంభించిన అన్నపూర్ణ రథం కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పర్యటిస్తూ పేద, నిరుపేద ప్రజలకు ఆహారాన్ని అందిస్తుందని తెలిపారు!
ప్రజాసేవే లక్ష్యంగా, పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే ధ్యేయంగా జీసీఆర్ ట్రస్ట్ నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు!
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ, కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, డిసిసి ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, సబ్బాని కృష్ణ హరి, డిసిసి జనరల్ సెక్రెటరీ జూలూరి సుధాకర్, సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు మెహర్ బాబాగౌడ్, కామారెడ్డి మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, సలీం, సుగుణ, చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, పిడుగు సాయిబాబా, కామారెడ్డి జిల్లా పద్మశాలి అధ్యక్షులు సిరిగాడ లక్ష్మీనారాయణ, రంగ రమేష్ గౌడ్, బండారి శ్రీకాంత్, కోటేశ్వర్, అరవింద్, ఆబిద్, యూత్ నాయకులు పండు శ్రీకాంత్, ఆకాష్, నిరంజన్, సేవాదళ్ నియోజకవర్గ మండల అధ్యక్షులు పాల్గొన్నారు!
#DailyBharath #Kamareddy #AnnapurnaRatham #GCRTrust #Congress