డైలీ భారత్, హైదరాబాద్: రాఫ్తార్ టీవీ హిందీ న్యూస్ ఛానల్ సౌత్ ఇండియా ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ బి. అమరేందర్ రావును నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అమరేందర్ రావు ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న అమరేందర్ రావును డాక్టర్ రాహుల్ దేవరాజ్ స్వయంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స, ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
నిమ్స్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలు, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.
అమరేందర్ రావుకు చికిత్స సమయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆయనకు సూచించారు. అవసరమైన వైద్య సహకారం అందించేందుకు ఆసుపత్రి యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని డాక్టర్ భరోసా ఇచ్చారు.
తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా వచ్చి పరామర్శించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌కు సీనియర్ జర్నలిస్ట్ అమరేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిమ్స్ వైద్యులు, సిబ్బంది కూడ సహకరిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.