| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

4 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసులో లాలాపేట పోలీసులు విజయం... మేనమామ, భార్య అరెస్ట్

4 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసులో లాలాపేట పోలీసులు విజయం... మేనమామ, భార్య అరెస్ట్

డైలీ భారత్, గుంటూరు:గుంటూరు ఈస్ట్ డీఎస్పీ టి. సీతారాం మాట్లాడుతూ... 2026 సెప్టెంబర్ 17న సాయిబాబా కాలనీకి చెందిన బత్తుల కొండమ్మ (65) తన మనుమరాలు సాయి పల్లవి (4)ని కిడ్నాప్ చేశారని పిర్యాదు చేశారని తెలిపారు.ఈ కేసులో లాలాపేట సీఐ ప్రసాద్ పర్యవేక్షణలో క్రైమ్ పోలీస్ సిబ్బంది శంకరు, మరియు కిరణ్ తో కలసి విచారణ ప్రారంభించామని డీఎస్పీ చెప్పారు. గుంటూరు బస్‌స్టాండ్, విజయవాడ రైల్వే స్టేషన్, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సమగ్ర శోధన చేశామని ఆయన వివరించారు.

ఆర్టీజీఎస్ 360 కెమెరాల ద్వారా బాలిక బాపట్లలో ఉన్నట్లు గుర్తించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. బాపట్ల రైల్వే స్టేషన్‌లో పాప ఉన్నట్లు సమాచారం అందగానే ఆర్‌పీఎఫ్ సిబ్బంది సహాయంతో బాలికను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఆయన చెప్పారు.

కిడ్నాప్‌కు పాల్పడిన వ్యక్తి బాలికకు వరసకు మేనమామ అయిన మనోజ్ కుమార్‌గా గుర్తించామని, అతనికి సహకరించిన భార్య షేక్ సుమయ్యను కూడా అరెస్ట్ చేశామని డీఎస్పీ సీతారాం వెల్లడించారు.బాలికను ఆమె నాయనమ్మకు సురక్షితంగా అప్పగిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. పోలీసుల త్వరిత చర్యలు, సాంకేతిక సాయం వల్ల బాలిక సురక్షితంగా తిరిగి వచ్చినందుకు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Previous గిరిజనుడు గొల్లిశెట్టి నాగు మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి... తుడుం దెబ్బ డిమాండ్
ADVERTISEMENT