| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ గూడూరి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 15 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కమిటీలో డాక్టర్ గూడూరి రవీందర్, ప్రయాకరావు వేణుకుమార్, పాతూరి వెంకట సంజీవరెడ్డి, చంద్రగిరి శ్రీధర్, కట్టెల బాబు, చేపూరి శ్రీనివాస్, దొంత దేవదాస్, డాక్టర్ పత్తిపాక అరుణ, డాక్టర్ పిన్న రాజు, డాక్టర్ చికోటి సంతోష్ కుమార్, డాక్టర్ జి. సురేంద్రబాబు, అనంతుల శివప్రసాద్, తాటిపాముల శివప్రసాద్, గుడ్ల సునీల్ బాబు, ముస్కు అజయ్ బాబు ఎన్నికయ్యారు.

అనంతరం నిర్వహించిన అంతర్గత ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా ప్రయాకరావు వేణుకుమార్, కోశాధికారిగా చంద్రగిరి శ్రీధర్, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పాతూరి వెంకట సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణ అధికారిగా జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్ వ్యవహరించారు. ఎన్నికలకు ముందు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల పదవీకాలం మూడేళ్లు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గూడూరి రవీందర్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాటు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.

Previous సీనియర్ జర్నలిస్ట్ అమరేందర్ రావును పరామర్శించిన నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్
ADVERTISEMENT