వారియర్స్ కప్ కైవసం.. వివిధ విభాగాల్లో 10 మంది విద్యార్థులకు పతకాలు.
డైలీ భారత్, నిజామాబాద్: నల్గొండలో ఈ నెల 27న తెలంగాణ జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన షోటోకన్ 11వ తెలంగాణ రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోటీల్లో కాకతీయ విద్యాసంస్థలకు చెందిన 10 మంది విద్యార్థులు పాల్గొని వివిధ విభాగాల్లో పతకాలు సాధించారు. వారియర్స్ కప్‌ను కాకతీయ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. అండర్-14 విభాగంలో షరీఖా ఫిర్దౌస్ కటా, కుమిటేలో ప్రథమ స్థానాలు సాధించగా.. బి. హర్షిత కుమిటేలో ద్వితీయ, కటాలో తృతీయ స్థానం సాధించింది. బి. హితజ్ఞ కటాలో తృతీయ స్థానంలో నిలిచింది.
అండర్-13 విభాగంలో జి. శ్రీకారి కటాలో ప్రథమ, కుమిటేలో ద్వితీయ స్థానం సాధించగా.. చ. ఐశ్వర్య కటాలో తృతీయ స్థానాన్ని దక్కించుకుంది.
అండర్-12 విభాగంలో షీమా నాజ్ కుమిటేలో ద్వితీయ, కటాలో తృతీయ స్థానం సాధించారు. ఎ. రిషిక, జి. హరిప్రియ, కె. వైష్ణవి, చ. ఆరాధ్య లు కారట విభాగంలో తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు కరాటే మాస్టర్ బ్రహ్మీని ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను కాకతీయ ఒలంపియాడ్ మంజీరా క్యాంపస్ యాజమాన్యం అభినందించారు. విద్యార్థులతో పాటు కరాటే మాస్టర్ చిన్నారి బ్రహ్మీని సేవలను సైతం యాజమాన్యం ప్రశంచించారు.