Posted on 2024-02-27 08:54:39
డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజీవ్ రహదారిపై డివైడర్‌ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొడుతూ మరో కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న కారు కుకునూర్ పల్లి వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. రాజీవ్ రహదారిపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ.. అవతలవైపు ఎదురుగా వస్తున్న మరోకారును బలంగా ఢీకొట్టింది. అనంతరం గాల్లో ఎగిరి బలంగా రోడ్డుపై పడింది.
ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్స్, బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలి : TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్
Posted On 2025-04-20 15:02:56
Readmore >నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్. జూ.ఎన్టీఆర్ మామకు షాక్
Posted On 2025-04-19 19:00:32
Readmore >బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్
Posted On 2025-04-19 18:21:12
Readmore >జూలూరుపాడు ఇంచార్జ్ గ్రామపంచాయతీ సెక్రటరీ హరిబాబు సన్మానించిన మల్టీపర్పస్ వర్కర్స్ మండల నాయకులు
Posted On 2025-04-19 16:29:52
Readmore >