Posted on 2026-01-14 17:46:55
సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
డైలీ భారత్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ కేంద్రాలు చేర్పులు, మార్పులపై మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, పట్టణ నాయకులు కొంగర సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు వైరా మున్సిపాలిటీలోని 20 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించారు. అందులో 5, 6, 9 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ప్రజలకు దూరంగా ఉండేలా ప్రతిపాదించబడినట్లు గుర్తించి, అలా చేస్తే ఓటర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి 5, 6, వార్డుల పరిధిలో సుందరయ్య నగర్, ఇందిరమ్మ కాలనీ, రాజశేఖర్ నగర్ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అక్కడే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట, ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
సీపీఎం ప్రతిపాదనలపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ గురులింగం మాట్లాడుతూ 5, 6 వార్డుల పోలింగ్ కేంద్రాల విషయాన్ని ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపించి, పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >