Posted on 2026-01-14 17:45:54
25న బహిరంగ సభకు మహిళలు కదిలి రావాలి
ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత
డైలీ భారత్, వైరా: హైదరాబాద్ లో జరిగే ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, ఐద్వా జాతీయ మహాసభల సందర్భంగా జనవరి 25న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగే బహిరంగ సభకు మహిళలు భారీగ తరలి రావాలని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని రెచర్ల బజార్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా పట్టణ నాయకురాలు మాడపాటి సుజాత ఐద్వా జెండాను ఎగురవేశారు. అనంతరం సభలో గుడిమెట్ల రజిత మాట్లాడుతూ మహిళపై జరుగుతున్న లైంగిక దాడులు, వివక్షతకు వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం ఐద్వా పోరాడుతుందని అన్నారు. కెంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, విద్యా, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జనవరి 25న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే బహిరంగ సభకు మహిళలు ఐద్వా చీర ధరించి భారీగా తరలివచ్చి ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి తోట కృష్ణవేణి, వైరా డివిజన్ కమిటీ సభ్యురాలు కంసాని మల్లికాంబ, కట్ల ఆశ, మాడపాటి రమ, పువ్వాడ సరోజిని, గూడపాటి శ్రీజ, గూడపాటి మయూక, దర్గాబి, రేచర్ల రాణి, కొమరనేని భానుమతి, పొడపాటి లక్ష్మి, ఐలూరి పద్మ తదితరులు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >