Posted on 2026-01-14 17:44:56
ముగ్గుల పోటీలు సంస్కృతి ఐక్యతను బలోపేతం చేస్తాయి
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత
డైలీ భారత్, వైరా: ముగ్గుల పోటీలు గ్రామీణ సంస్కృతి, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత అన్నారు. వైరా మండలం పాలడుగు సిపిఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామంలోని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ముగ్గుల పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ప్రధమ బహుమతి కేసగాని రజని, రెండోవ బహుమతి వడ్డెబోయిన వెంకటలక్ష్మి, మూడోవ బహుమతి అరెపల్లి అనూష, నాల్గవ బహుమతి కేసగాని కవిత సాధించారు, పాల్గన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, గుడిమెట్ల రజిత మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గ్రామంలోని మహిళల్లో ఐక్యత పెరగడానికి ముగ్గుల పోటీలు దోహదం చేస్తాయని అన్నారు. మహిళలను ప్రోత్సహిస్తూ మంచిని బోధించే సంసృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని అన్నారు. మహిళల సృజనాత్మకతను వెలికి తీయడానికి, మహిళల్లో చైతన్యం పెంచడానికి, మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికీ ముగ్గుల పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల కమిటీ సభ్యులు బాజోజు రమణ, షేక్ మజీద్, సీనియర్ నాయకులు వనమా చిన్న సత్యనారాయణ, పాలడుగు సర్పంచ్ గద్దల నరసింహారావు, ఉప సర్పంచ్ ఓర్సు సూజాత, గ్రమ శాఖ కార్యదర్శి షేక్ మజీద్ బీ, సిపిఎం వార్డ్ మెంబర్ షేక్ రేహనా బేగం, షేక్ రఫీ, షేక్ అబ్దుల్ రహీం, షేక్ మౌలాలి, షహనాజ్ తదితరులు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >
ఇస్రోజివాడి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-01-14 12:14:02
Readmore >