| Daily భారత్
Logo




38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

News

Posted on 2026-03-04 11:46:19

Share: Share


38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

మూడు ఓట్ల తేడాతో ఓటమి..

జిల్లా కోర్టును ఆశ్రయించిన రంగా మాధవి

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 38వ వార్డులో దొంగ ఓట్లు నమోదయ్యాయని, మొత్తం 200 వరకు అక్రమ ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగా మాధవి ఆరోపించారు. కేవలం మూడు ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం బాధాకరమని పేర్కొంటూ 38వ వార్డులో రీపోలింగ్ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సమీప అభ్యర్థి ఇప్ప ఉమారాణి మూడు ఓట్ల తేడాతో గెలుపొందారని తెలిపారు. మొత్తం 1149 ఓట్లు పోలవ్వగా అందులో 200 వరకు దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు.

తమ కాలనీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రముఖులు పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ చేశారని, ఓటర్లకు ఫోన్ చేసి కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని సూచించారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు రెండు చోట్ల ఓట్లు వేశారని ఆరోపిస్తూ, రాజంపేట ఉప సర్పంచ్ ఇమ్రాన్ అలీతో పాటు ఒక ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయుడు రెండు చోట్ల ఓటు వేశారని చెప్పారు. పార్కుపల్లి అనే వ్యక్తి 38వ మరియు 34వ వార్డుల్లో ఓటు వేశారని తెలిపారు.

దొంగ ఓట్లు వేసిన వారిలో రాజకీయ నాయకులు, ఉద్యోగులు, మత పెద్దలు ఉన్నారని ఆరోపించిన ఆమె, ఎన్నికల సమయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఓటర్ ఐడీ కార్డు మరియు ఓటరు జాబితాలో పేరు ఉందని అధికారులు చెప్పి నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

ఈ విషయమై ఈ నెల 3న కామారెడ్డి జిల్లా కోర్టులో కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 6న విచారణ జరగనుందని, న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇప్ప ఉమారాణి తరఫున 119వ బూత్ ఏజెంట్‌గా పని చేసిన మోచి సురేందర్ మాట్లాడుతూ, రాజంపేట గ్రామస్తులు వచ్చి ఓట్లు వేయడాన్ని తాను చూశానని పేర్కొన్నారు.


Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >