| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

డైలీ భారత్ ఇంటర్నెట్ డెస్క్:తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్, ప్రముఖ సినీ నటి త్రిషపై అత్యంత వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై డీఎంకే (DMK) నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం (ఆగస్టు 4, 2026) ఉదయం అరెస్ట్ చేశారు. చెన్నై నీలాంగరైలోని ఆయన నివాసంలో తంజావూర్ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

వివాదం ఏమిటి?

సోమవారం తంజావూర్‌లో కావేరి జల వివాదంపై డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి తీవ్రమైన ద్వంద్వార్థాలు (Double Meaning), మహిళలను కించపరిచేలా లైంగికపరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.

పోలీసుల యాక్షన్

ఉదయనిధి వ్యాఖ్యలపై అధికార తమిళగ వెట్రి కళగం (TVK) మహిళా విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తంజావూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు జాతీయ మహిళా కమిషన్‌ను (NCW) కూడా ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా తంజావూర్ ఈస్ట్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం ఉదయమే చెన్నై చేరుకున్న పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తంజావూర్‌కు తరలించారు.

"ఇదొక జోక్".. ఉదయనిధి రియాక్షన్

పోలీసులు తనను అరెస్ట్ చేస్తున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ నవ్వుతూ స్పందించారు. ఈ అరెస్ట్‌ను ఆయన ఒక "జోక్" గా అభివర్ణించారు. చట్టపరంగానే దీనిని ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. మరోవైపు ఈ అరెస్ట్‌పై డీఎంకే శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.

హైకోర్టును ఆశ్రయించిన లీగల్ టీమ్

ఉదయనిధి స్టాలిన్ లీగల్ టీమ్ ఈ అరెస్ట్‌ను సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో అత్యవసర ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ ఘటనతో తమిళనాడులో అధికార TVK, ప్రతిపక్ష DMK మధ్య రాజకీయ యుద్ధం పీక్స్‌కు చేరింది. అటు బీజేపీ సైతం ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, మహిళల పట్ల డీఎంకే వైఖరికి ఇది నిదర్శనమని విమర్శిస్తోంది. తాజా పరిణామాలతో తమిళనాడు వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు.

Previous యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Next "మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
ADVERTISEMENT