| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

డైలీ భారత్, విజయవాడ: తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు సంస్కృతి ఔన్నత్యాన్ని, మన సంప్రదాయాల వైభవాన్ని తన అద్భుతమైన కవితా శిల్పంతో సజీవంగా ఆవిష్కరిస్తున్న కవయిత్రి మంజుల పత్తిపాటి కి "మిత్ర రత్నావళి" బిరుదు ప్రదానం చేశారు.

స్నేహం అనే పవిత్ర బంధానికి ప్రతీకగా జులై 30న జరుపుకున్న స్నేహితుల దినోత్సవం సందర్భంగా, తెలుగు భాష-సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే స్ఫూర్తిదాయకమైన కవిత్వాన్ని రచించినందుకు ఆమె సాహిత్య ప్రతిభను, సాంస్కృతిక నిబద్ధతను గుర్తిస్తూ ఈ బిరుదును అందజేశారు.

తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 2న విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ సత్కారం ఘనంగా నిర్వహించారు.

సాహిత్యరంగంలో విశిష్టమైన సేవలను అందిస్తూ, పాఠక హృదయాలను అలరిస్తున్న మంజుల పత్తిపాటి కి ఈ గౌరవం దక్కడం పట్ల సాహితీ ప్రముఖులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.


కవయిత్రి మంజుల పత్తిపాటికి "మిత్ర రత్నావళి" బిరుదు. తెలుగు భాషా సేవకు విజయవాడలో ఘన సత్కారం.


#మంజులపత్తిపాటి #మిత్రరత్నావళి #తెలుగుసాహిత్యం #విజయవాడ #స్నేహదినోత్సవం

Previous సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Next వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
ADVERTISEMENT