డైలీ భారత్ స్పెషల్:
మట్టి తల్లికి మళ్లీ ప్రాణం పోద్దాం....
మెరుగైన విత్తనాలంటూ…
రసాయన ఎరువులంటూ…
బడా సంస్థల ఆశలకు దాసోహం అయి…
రసాయన ఎరువులతో
అధిక దిగుబడులు సాధించాం..!
పంట పెంచాం… పైసలు లెక్కించాం…
కానీ మట్టి తల్లి మౌనాన్ని మరచిపోయాం..!
పంట పెరిగి రైతన్న ముఖం వెలిగింది..!
కానీ అదే వేళ
మట్టి తల్లి బలహీనమైంది..!
పంట చేతికొచ్చిన తర్వాత
పొలంలో మిగిలిన వరి గడ్డి,
పత్తి కాడలు, ఆకులు అలములను
వ్వ్యర్థాలంటూ కాల్చి…
నెల తల్లిని నిరావరణంగా చేస్తున్నాం మనం..!
కొన్ని సంవత్సరాల తరువాత
భూతాపం పెరిగి మన భవిష్యత్తు
మనమే అగమ్యగోచరం చేసుకుంటాం మనం..!
అందుకే ఇకనైనా…
విషపు వలయాన్ని విడిచిపెట్టి,
ప్రకృతి ఒడికి చేరాలి..!
గోఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేయాలి..!
రచన: మంజుల పత్తిపాటి
చరవాణి 9347042218
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.