| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేను సైతం కవితక్క తెలంగాణ రక్షణ సేనలో... 90 ఏళ్ల వృద్ధురాలి చేరికతో సంచలనం

నేను సైతం కవితక్క తెలంగాణ రక్షణ సేనలో... 90 ఏళ్ల వృద్ధురాలి చేరికతో సంచలనం

ముస్తాబాద్ (డైలీ భారత్): తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో బుధవారం భారీ చేరికలు జరిగాయి.

సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ మజీద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు అల్లే శంకర్, ముస్తాబాద్ మండల ఇంచార్జ్ మార్వాడి దేవరాజు, ఆవునూరు గ్రామ ఇంచార్జ్ చిన్ని బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.

అయితే ఈ చేరికల సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న మాదారపు వెంకటవ్వ (90) అనే వృద్ధురాలు సరిగా నడవలేని స్థితిలో కర్ర పట్టుకుని చేరికలు జరిగే ప్రాంతానికి వచ్చి "నేను సైతం కవితక్క పార్టీలో చేరుతా" అని చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.

వెంటనే సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ మజీద్ ఆ వృద్ధురాలికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మజీద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, చిన్నపిల్లల నుండి 90 ఏళ్ల వృద్ధుల వరకు అందరూ కవితక్క పార్టీ వైపే చూస్తున్నారని అన్నారు. కవితక్క చేస్తున్న ప్రజా సేవకు రాష్ట్ర ప్రజలందరూ ఆమె ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి కవితక్క ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యంగా గ్రామ గ్రామాన మహిళలు సంతోషంగా పార్టీలోకి చేరడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల ఇంచార్జ్ కదిరే భాస్కర్ గౌడ్, నియోజకవర్గ యువజన నాయకుడు సయ్యద్ జావిద్, మండల నాయకులు బైరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Previous నైజాం కాలం నాటి బీబీపేట చెరువును నింపండి... 7 గ్రామాల రైతుల గోస పట్టించుకోరా?
ADVERTISEMENT