| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్ బగాయత్ వెంకట్ సాయినగర్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ మైసమ్మ దేవాలయంలో అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం గణపతి హోమం, అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలను వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కాలనీ వాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో కాలనీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. 


ఈ కార్యక్రమంలో మల్యాల బాలయ్య, రాచమల్ల రమేష్, సికినమెట్ల ప్రభులింగం,   సర్వసత్తయ్య యాదవ్ గోపాల్ అన్న  CH, నరసింహులు M, ఐలేష్ యాదవ్ M, రమేష్ యాదవ్ మురళి M, శివ యాదవ్ శ్రీనివాస్ చందన్ సింగ్ యాదమ్మ రాజు చంద్రయ్య B, రాజు యాదవ్ CH, సత్యనారాయణ M,సారయ్య  శంకర్ S,అనిల్ C.H. గణేష్, R. శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు

Previous "మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Next ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ADVERTISEMENT