డైలీ భారత్, కామారెడ్డి : పెద్ద కొడాపుగల్ గ్రామానికి చెందిన పండరి – స్వరూప దంపతులు వరుస విషాదాలతో తీవ్ర కష్టాల్లో జీవనం సాగిస్తున్నారు. కుమారుడిని కోల్పోయిన ఈ కుటుంబానికి మరో దెబ్బగా స్వరూప గారు గత 10 సంవత్సరాలుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.
వైద్య ఖర్చుల కోసం కుటుంబం తమ 25 గుంటల భూమిని విక్రయించుకున్నట్లు తెలిసింది.
ఈ విషయం తెలుసుకున్న శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ దత్త ఆధ్వర్యంలో ట్రస్ట్ తరఫున “నెలకొక మంచి పని – నెలకొక సేవ” కార్యక్రమంలో భాగంగా 11వ నారాయణ సేవ నిర్వహించారు.
కామారెడ్డి బృందావన కాలనీలో నివసిస్తున్న ఈ నిరుపేద కుటుంబానికి శ్రీ మాత కుటుంబ సభ్యుడు మచ్చ నాగరాజు గుప్తా ద్వారా 25 కిలోల బియ్యం, కిరాణా సామానులు, కూరగాయలు అందజేశారు.
ట్రస్ట్ సభ్యులు భవిష్యత్తులో కూడా కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే దాతలు ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
పట్నం శెట్టి శ్రీనివాస్, మచ్చ నాగరాజు గుప్తా, సాయిరాం, సంఘ రాజు, భాస్కర్, శ్రీకాంత్
మానవ సేవే మాధవ సేవ — శ్రీమాతా సేవ కుటుంబం