| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల BRS సీనియర్ నేత గూడూరి ప్రవీణ్‌కు డాక్టరేట్...

సిరిసిల్ల BRS సీనియర్ నేత గూడూరి ప్రవీణ్‌కు డాక్టరేట్...

60 ఏళ్ల వయసులో అరుదైన ఘనత

రాజన్న సిరిసిల్ల (డైలీ భారత్): సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు గూడూరి ప్రవీణ్‌కు ప్రతిష్టాత్మక డాక్టరేట్ లభించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని అర్ని విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ పట్టాను ప్రకటిస్తూ అధికారిక లేఖను విడుదల చేసింది.

రాజనీతి శాస్త్రంలో PG, MPhil పూర్తి చేసిన ప్రవీణ్.. "భారతదేశంలో సామాజిక మాధ్యమాల ప్రభావం, రాజకీయ చైతన్యం" అంశంపై మూడేళ్లుగా పరిశోధన చేశారు. CSDS - లోక్ నీతి సర్వే ఫలితాల ఆధారంగా రూపొందించిన ఆయన పరిశోధనా గ్రంథాన్ని యూనివర్సిటీ డాక్టరేట్‌కు ఎంపిక చేసింది. త్వరలో జరిగే స్నాతకోత్సవంలో డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.


60 ఏళ్ల వయసులోనూ చదువుపై ఉన్న తపనతో డాక్టరేట్ సాధించడం పట్ల పలువురు రాజకీయ నేతలు, పద్మశాలి ప్రముఖులు ఆయనను అభినందిస్తున్నారు.

Previous ACB వలలో GHMC టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్...
ADVERTISEMENT