హైదరాబాద్ (డైలీ భారత్) :హైదరాబాద్‌లో ACB అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
GHMC గోల్కొండ జోన్, సర్కిల్-33, మెహదీపట్నంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తులసిరాం సునీత లంచం తీసుకుంటూ ACB కి చిక్కింది.
బిల్డింగ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి, డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన స్పీకింగ్ ఆర్డర్లను విస్మరించి, భవిష్యత్తులో వేధింపులు లేకుండా సహకరిస్తానని చెప్పి ఆమె రూ. 8 లక్షలు డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా రూ. 4 లక్షలు తీసుకుంటుండగా సిటీ రేంజ్-1 ACB అధికారులు పట్టుకున్నారు.
నిందితురాలి నుంచి లంచం సొమ్ము రూ. 4,00,000/- తో పాటు, అదనంగా లెక్కల్లో లేని నగదు రూ. 2,50,000/- ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం నిందితురాలిని నాంపల్లిలోని అదనపు స్పెషల్ జడ్జి (SPE & ACB కేసులు) ముందు హాజరుపర్చనున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారు వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచారు.
లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు, వాట్సాప్ 9440446106 కు ఫిర్యాదు చేయాలని ACB తెలిపింది.