Posted on 2026-01-14 17:43:41
సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి,
మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు కూడా అమలు చేయాలి
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
డైలీ భారత్, వైరా: వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, గ్రామీణ పేదలకు జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించి, పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ సమావేశం స్థానిక పార్టీ కార్యాలయం
బోడెపూడి భవనంలో డివిజన్ కమిటీ సభ్యురాలు కొండబోయిన ఉమావతి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని కోరారు. పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న పేదలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి అవకాశాలు లేక పట్టణ పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి కనీసం 100 రోజుల ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. వైరా నియోజకవర్గ సిపిఎం శ్రేణులు ఇంటింటికి సిపిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేసి సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, దుగ్గి కృష్ణ, సుంకర సుధాకర్, కొండబోయిన నాగేశ్వరరావు, డివిజన్ నాయకులు చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు, కె. నరేంద్ర, తోట నాగేశ్వరావు, ఏర్పుల రాములు, బాదావత్ శ్రీనివాస్, బోయినపల్లి శ్రీనివాసరావు, మాంగంటి తిరుమలరావు, తూము సుధాకర్, వజ్జా రామారావు తదితరులు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >
ఇస్రోజివాడి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-01-14 12:14:02
Readmore >