| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భాగ్యనగరంలో జోరుగా నకిలీ సరుకుల దందా

భాగ్యనగరంలో జోరుగా నకిలీ సరుకుల దందా

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్​ నగరంలో నకిలీ సరుకుల దందా జోరుగా సాగుతోంది..నూనెలు, అల్లం వెల్లుల్లి పేస్టులు, సబ్బులు, సర్ఫ్​లు, గుడ్​ నైట్​ లు, ఆల్ అవుట్లు ఇలా ప్రతి నిత్యావసరాలను కల్తీ చేసి విక్రయిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన నకిలీ సరుకుల అడ్డుకట్టపడటం లేదు. తాజాగా బేగంబజారులో పలు గోదాంలు, షాపులపై దాడులు చేసిన సీసీఎస్​ అధికారులు నకిలీ కిరాణా సరుకుల దందా గుట్టురట్టు చేశారు.మంగళవారం( మార్చి3) హైదరాబాద్​ సిటీలోని బేగంబజారులో పలు షాపులు, గోదాంలపై సీసీఎస్ స్పెషల్​ టీం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో హోల్​ సేల్​ గా విక్రయిస్తున్న నకిలీ టైడ్​, ఏరియల్​, సర్ఫ్​ ఎక్సెస్​, జెమినీ టీపొడి ప్యాకెట్లను గుర్తించారు.

1340 రెడ్ లేబుల్ నకిలీ ప్యాకెట్లు, 100 తాజ్ మహల్ టీ నకిలీ ప్యాకెట్లు, 75 కిలోల లూజ్ టీ పౌడర్, 1900 సర్ఫ్ ప్యాకెట్లు, 3600 నకిలీ గుడ్ నైట్ లిక్విడ్ బాటిల్స్ సీజ్ చేశారు.9500 నకిలీ లేబుల్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అక్రమ దందా నిర్వహిస్తున్న గుజరాతీకి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుజరాత డీలర్లనుంచి తక్కువ నాణ్యతగల మెటీరియల్​ కొనుగోలు చేసి నకిలీ ప్యాకింగ్​ కవర్లతో బ్రాండెడ్ గానమ్మించి అమ్ముతున్నారు.

నకిలీ వస్తువుల తయారీ, విక్రయంపై వస్తున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సీసీఎస్​స్సెషల్​ టీం బేగంబజారులోని పలు షాపులు, గోదాంలపై దాడులు చేసింది. నకిలీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్న గుజరాత్ కు చెందిన జయ రామ్(30), కచ్చవా సురేందర్(34), హనుమాన్ రామ్(21)లను అరెస్ట్ చేశారు.

అనతరం గోషామహల్​, అఫ్జల్​ గంజ్​ పోలీసులకు అప్పగించారు. సరుకులు కొనుగోలు సమయంలో క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా తనిఖీ చేయాలని పోలీసుల సూచిస్తున్నారు.

Previous ఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఫాలో కాకుంటే డబ్బులు రావు
Next రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
ADVERTISEMENT