దుమ్ము ధూళితో ప్రజల తీవ్ర ఇబ్బందులు.. పనులు వేగవంతం చేయాలి
డైలీ భారత్, అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండల కేంద్రాల్లో చేపట్టిన సెంటర్ లైటింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ పనులు పూర్తికాకపోవడంతో రహదారులపై దుమ్ము ధూళి పేరుకుపోయి ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అభివృద్ధి పనులు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల ఆరోగ్యం, రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రహదారులపై దుమ్ము ధూళిని నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో పెండింగ్‌లో ఉన్న సెంటర్ లైటింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని తాటి వెంకటేశ్వర్లు కోరారు.