| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హెల్మెట్ లేక యువకుడి మృతి... స్నేహితుని దశదిన కార్యక్రమంలో నివాళులర్పించిన కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ

హెల్మెట్ లేక యువకుడి మృతి... స్నేహితుని దశదిన కార్యక్రమంలో నివాళులర్పించిన కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ

డైలీ భారత్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామానికి చెందిన రూంకు సత్యనారాయణ ఇటీవల బైక్ పై వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో అతని స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఆదివారం నిర్వహించిన దశదిన కార్యక్రమానికి కొత్తగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై, సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, "ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. హెల్మెట్ లేకపోవడం వల్లే చిన్న ప్రమాదం కూడా ప్రాణాలు తీస్తుంది" అని హెచ్చరించారు.

స్నేహితుని మరణంతో కుంగిపోకుండా, ప్రేమానురాగాలతో దశదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మిత్రులు నిజమైన స్నేహానికి అర్థం చెప్పారని, వారి స్నేహం ఆదర్శనీయమని కొనియాడారు. అందరూ వీరిలాగే కష్టకాలంలో ముందుండి నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం మృతుని తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ జితేందర్, 2 టౌన్ సీఐ ఖాసిం, 3 టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి, ఎస్బీ సీఐ రాయల వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


#Kothagudem #DSPAdinarayana

Previous కొమ్ముగూడెంలో ఘనంగా పెద్దమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం... 24 మంది భక్తుల మాలధారణ
Next అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో సెంటర్ లైటింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి : తాటి
ADVERTISEMENT