డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పద్మశాలీల ఆత్మాభిమానం కోసం పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయాన్ని రేపు ప్రారంభించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.
తేదీ: 12.10.2026, సోమవారం ఉదయం 11:31 గంటలకు, చేనేత జౌళి శాఖ ప్రక్కన, శివాలయం శివనగర్ దగ్గర ఈ కార్యాలయ ప్రారంభోత్సవం జరగనుంది. మన పద్మశాలీల ఇజ్జత్ కి, ఆత్మగౌరవానికి, సంఘటిత శక్తికి, సమానత్వానికి ప్రతీకగా ఈ కార్యాలయం ఉండబోతోందని పేర్కొన్నారు.
సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు ఏకత్వ భావనకు, కార్మికుడి నుండి వ్యాపారుల హక్కులు మరియు సంక్షేమం కోసం, విద్యార్థులు, ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, బ్యాంకర్లు, మహిళలు, యువత, రాజకీయ మరియు ఇతర వృత్తులలో ఉన్న పద్మశాలి కుల బంధువులందరి సముచిత గౌరవం కోసం ఈ సంఘం పనిచేయనుందని తెలిపారు.
"సిరిసిల్ల గడ్డ పద్మశాలీల అడ్డా" అనే నినాదాన్ని భవిష్యత్ తరాలకు అందించడం, పద్మశాలీల రాజకీయ చైతన్యం మరియు హక్కుల సాధన కోసం సమష్టి కార్యాచరణ చేపడతామని తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, మండల పద్మశాలి సంఘాల పెద్దలు విచ్చేస్తున్నారని, కావున పెద్ద ఎత్తున కుల బంధువులందరూ హాజరై విజయవంతం చేయాలని పట్టణ పద్మశాలి సంఘం (Regd No 590/2025) విజ్ఞప్తి చేసింది.
ఈ ప్రకటనలో నాగుల శ్రీనివాస్, మాదాసు శ్రీనివాస్, గుంటుక పురుషోత్తం, జిందం రవీందర్, గాజుల సదానందం, కుందెన సాయి శరత్, తాటి పాముల సత్యనారాయణ, దూడం సురేష్, దాసరి వెంకటేష్, మోర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
#Sircilla #Padmashali