Posted on 2026-03-04 09:46:32
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఉపాధి హామీ కూలీలకు ముఖ్య గమనిక. ఉపాధిహామీ పథకంలో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ పథకంలో అక్రమాల జరగకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల అమల్లోకి తెచ్చింది.ఇకపై ఉపాధిహామీ కూలీలకు ముఖ హాజరు (ఫేషియల్ అథెంటికేషన్)తప్పనిసరి చేసింది. మార్చి రెండో తేదీ నుంచి (సోమవారం) ఈ విధానం కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నూతన విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. గతంలో జాబ్ కార్డులో ఒకరి పేరు ఉంటే.. మరొకరు ఉపాధిహామీ పనులకు వెళ్లే పరిస్థితి ఉండేది. అలాగే మస్టర్‌లో దొంగ సంతకాలు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ-కేవైసీ విధానం తీసుకువచ్చింది. ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి ఉపాధిహామీ కూలీకి ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. ఈ కేవైసీ పూర్తి అయితే అక్రమాలకు పూర్తిగా స్వస్తి పలకవచ్చనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ తీసుకువచ్చింది. 2025 అక్టోబర్ నెలలో ఉపాధి హామీ కూలీలకు ఈకేవైసీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు మెజారిటీ కూలీలకు ఈ ప్రక్రియను పూర్తిచేశారు.మరోవైపు కొత్త విధానం ప్రకారం ఉపాధి హామీ పనికి వెళ్లిన సమయంలో పనులు చేసే ప్రదేశంలో కూలీలకు ఒక ఐడీని క్రియేట్ చేస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్, టీఏలు కూలీలకు మొదట ఫోటో తీస్తారు. పని పూర్తైన నాలుగు గంటల అనంతరం మరోసారి ఉపాధి హామీ కూలీల ఫోటోలు తీస్తారు. దీంతో పనులు పూర్తి చేసినట్లు సమాచారం అందుతుంది. వీటిలో ఏదీ మర్చిపోయినా ఉపాధి హామీ కూలీలకు బిల్లులు జమకావు. అయితే ఈ విధానం అమల్లో కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి.మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ సిగ్నళ్లు సరిగా లేనటువంటి పరిస్థితి. దీంతో ఫేసియల్ రికగ్ని్షన్ విధానం అనేది కష్టతరంగా మారింది. అయితే పని ప్రదేశంలో ఉపాధిహామీ కూలీల ఫొటోలు తీయాలని.. ఆ తర్వాత సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి యాప్‌లో అప్లోడ్ చేయాలని అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచిస్తున్నారు. ఉపాధిహామీ పథకం పనుల్లో పారదర్శకత కోసమే కొత్తగా ముఖ హాజరు విధానం తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ విధానంతో ఉపాధి కూలీలకు వేతనాలు సకాలంలో అందుతాయని.. అలాగే ఉపాధిహామీ పథకం సిబ్బందికి చాలా సమస్యలు తగ్గిపోతాయని చెప్తున్నారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >