| Daily భారత్
Logo




జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

News

Posted on 2026-01-14 18:45:43

Share: Share


జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో ‘కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్’ ఘనంగా నిర్వహణ

భోగి మంటలు, రంగురంగుల పతంగుల సందడితో ఉత్సాహంగా గడిపిన పోలీస్ కుటుంబాలు

అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులతో కలిసి పతంగులు ఎగురవేసిన జిల్లా ఎస్పీ

డైలీ భారత్, కామారెడ్డి: భోగి & సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో “కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్” (పతంగుల పండుగ) ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ గారు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని సందడి చేశారు.

కార్యక్రమం ప్రారంభంలో జిల్లా ఎస్పీ సంప్రదాయబద్ధంగా భోగి మంటను వెలిగించి, జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన పతంగుల పండుగలో జిల్లా అడిషనల్ ఎస్పీ, కామారెడ్డి ఏఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి రంగురంగుల పతంగులను ఎగురవేస్తూ ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,

పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని, ఇలాంటి వేడుకలు పోలీస్ కుటుంబాల మధ్య ఐక్యతను, పరస్పర స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. నిరంతరం విధుల్లో నిమగ్నమయ్యే పోలీస్ సిబ్బందికి ఈ తరహా కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని, కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.

అదేవిధంగా పతంగులు ఎగురవేసే సమయంలో చైనీస్ మాంజా లేదా నైలాన్ మాంజా వాడకూడదని స్పష్టం చేశారు. అవి పక్షులకు మాత్రమే కాకుండా, వాహనదారుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ముప్పుగా మారతాయని హెచ్చరించారు. ప్రజలంతా కేవలం కాటన్ త్రెడ్ (నూలు దారం) మాత్రమే ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.

పండుగలు ఆనందాన్ని పంచాలి గానీ విషాదాన్ని మిగల్చకూడదని, సంప్రదాయాలను గౌరవిస్తూ భద్రతా నియమాలను పాటించాలన్నారు. ప్రతి కుటుంబం సురక్షితంగా, ఆనందంగా ఉండాలన్నదే పోలీస్ శాఖ సంకల్పమని జిల్లా ఎస్పీ తెలిపారు.


ఈ కార్యక్రమంలో కామారెడ్డి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహ రెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, కృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, జిల్లా పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >
Image 1

బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-15 06:39:17

Readmore >
Image 1

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-14 22:44:54

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

Posted On 2026-01-14 18:45:43

Readmore >
Image 1

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-01-14 17:46:55

Readmore >
Image 1

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-01-14 17:45:54

Readmore >
Image 1

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Posted On 2026-01-14 17:44:56

Readmore >
Image 1

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-01-14 17:43:41

Readmore >
Image 1

గల్ఫ్ మృతదేహం తరలింపు... ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted On 2026-01-14 17:39:34

Readmore >
Image 1

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ

Posted On 2026-01-14 15:26:21

Readmore >