Posted on 2024-02-27 17:45:48
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల సిరిసిల్ల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఇంచార్జీ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారం, కేకే మహేందర్రెడ్డి చొరవతో రెండు కోట్ల రూపాయలు మంజూరు కావడంపై సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రెండు కోట్ల రూపాయలను గర్ల్స్ స్కూల్ లలో మూత్రశాలలు బోర్లకు, ప్రతి వార్డులో డ్రైనేజీలు, రోడ్డు నిర్మాణ పనులకు వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, జిల్లా నాయకులు వైద్య శివప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు స్వర్గం రాజు, నక్క నరసయ్య, రఫీ, అస్లాం, నల్ల శ్రావణ్, గడ్డం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >