| Daily భారత్
Logo




కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు

News

Posted on 2026-03-13 12:16:49

Share: Share


కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు

డైలీ భారత్, హుజూర్ నగర్: రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకురాలు మహిళా సాధికారతకు కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా జాగృతి శ్రేణుల ఆధ్వర్యంలో శుక్రవారం హుజూర్ నగర్ పట్టణ కేంద్రం లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసి కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియ చేశారు.ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర నాయకులు కేఎల్ఎన్ రావు, షేక్ మస్తాన్ లు మాట్లాడుతూ మహిళా సాధికారత సామాజిక సేవలో ఆమె చేసిన కృషిని కొనియాడారు.

రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలిగా కవిత గుర్తింపు పొందారన్నారు భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేస్తూ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలగాలని కోరారు. మహిళా బిల్లు చట్టంగా రూపొందడానికి, బీసీలకు విద్యా ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ సాధనకు కవిత పోరాటం చేసారన్నారు. 

ఇటీవల ఖమ్మంలో వెలుగుమట్ల గ్రామంలో ఇండ్ల కూల్చివేత బాధితుల పక్షాన నిలబడి నిరాహార దీక్ష చేసిన ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చి బాధితులకు న్యాయం చేయడం కవిత పోరాట ఫలితమన్నారు. ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల సమస్యల పట్ల పోరాటం చేయడంలో విఫలమైతే కవిత ప్రశ్నించే గొంతుకై బాధితుల పక్షాన పోరాటం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో కె.సత్య నారాయణ రెడ్డి, సౌదశోతు బిక్షం, మామిడి పన్నీరు, సిహెచ్ నర్సింహ రావు, పి.నర్సింహ రావు వేణు, బానోతు నర్సింహ , వెంకట కృష్ణ, గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు


Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >