| Daily భారత్
Logo




సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!

News

Posted on 2026-03-13 17:33:46

Share: Share


సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ కు మ్యూల్ అకౌంట్లు సమకూరుస్తున్న వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు.

ఫిబ్రవరిలో ఆపరేషన్ ఆక్టోపస్ పేర వేర్వేరు రాష్ట్రాల్లో దాడులు జరిపిన ప్రత్యేక బృందాలు 117 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీటిలో అత్యధికంగా ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ నేరాలు 63 ఉన్నాయి. ఆ తరువాత 6 డిజిటల్ అరెస్టులు, 4ఓటీపీ ఫ్రాడ్, ఒక సోషల్ మీడియా మోసం కేసులు ఉన్నాయి. ఇక, గత నెలలో 34.76లక్షల రూపాయలను బాధితులకు రీఫండ్ చేశారు.

1081కేసుల్లో..

ఆపరేషన్ ఆక్టోపస్ లో భాగంగా 16 రాష్ట్రాల్లో అరెస్ట్ చేసిన 117మంది నిందితులకు దేశవ్యాప్తంగా 1,081 కేసులతో సంబంధం ఉన్నట్టుగా వెల్లడైందని అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఎం.శ్రీనివాస్ తెలిపారు. వీరి ఖాతాల్లో నుంచి 139 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా నిర్దారణ అయ్యిందన్నారు. ఇక, నిందితుల నుంచి 36లక్షల రూపాయల నగదు, 221 మొబైల్ ఫోన్లు, 26ల్యాప్ టాప్ లు, 115 చెక్ బుక్కులు, 141 సిమ్ కార్డులు, 54 డెబిట్ కార్డులు, 56 షెల్ కంపెనీల స్టాంపులు, ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్, 152 పాస్ బుక్కులు, 5 ట్రేడ్ లైసెన్సులు, 6 ఆడిట్ నివేదికలు, 3 లెడ్జర్లను సీజ్ చేసినట్టు వివరించారు.

జోనల్ సైబర్ సెల్స్..

ఇక, జోనల్ సైబర్ సెల్స్ కు గత నెలలో 2,963 పిటిషన్లు వచ్చాయి. వీటిలో 461 పిటిషన్లపై అధికారులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఈ కేసుల్లో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 11మందిని అరెస్ట్ చేశారు. బాధితులకు 24.10 లక్షల రూపాయలను రీఫండ్ చేశారు.

సైబర్ పెట్రోలింగ్..

సైబర్ పెట్రోలింగ్ ను నిరంతరం జరుపుతూ ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ ద్వారా ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ లను సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తున్న124 ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం ప్రొఫైళ్లను సైబర్ పోలీసులు గుర్తించారు. 539 పెయిడ్ అడ్వర్టయిజ్ మెంట్లను నడుపుతూ యువతను బెట్టింగ్, గేమింగ్ వైపు ఆకర్షితులను చేస్తున్నారు. ఈ క్రమంలో 124 ప్రొఫైళ్లను సోషల్ మీడియా ప్లాట్ ఫాంల నుంచి తొలగించారు.

సీ మిత్ర..

సీ మిత్ర ద్వారా గత నెలలో సైబర్ మోసాలకు గురైన 2,396మంది బాధితులకు ఫిర్యాదులు నమోదు చేయటంలో మార్గదర్శకత్వం అందించారు. ఈ క్రమంలో వచ్చిన కంప్లయింట్ల ఆధారంగా 257 జీరో ఎఫ్ఐఆర్ లను జారీ చేశారు. సైబర్ మోసానికి గురైతే బాధితులు వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేయాలని అదనపు కమిషనర్ శ్రీనివాసులు సూచించారు. దాంతోపాటు www.cybercrime.gov.in లో కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >