| Daily భారత్
Logo




పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

News

Posted on 2026-06-27 15:19:05

Share: Share


పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

డైలీ భారత్, ఖమ్మం: మత్తు పదార్దాల నిర్మూలనలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన సుమారు 3 కోట్ల 43 లక్షల విలువ చేసే 687.409 కిలోల ఎండు గంజాయిని కోర్టు ఆదేశాల మేరకు శాస్త్రీయ పద్ధతిలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, సిసిఆర్బీ ఏసీపీ సాంబరాజు శనివారం తల్లాడ మండలం గోపాల్‌పేటలోని ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో దహనం చేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 29 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్థులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నిబంధనలు అనుగుణంగా ఈ దహనం జరిగిందని టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్బంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి సాగు చేసినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సి ఐ సర్వయ్య, ఇన్స్పెక్టర్ మోహన్ బాబు పాల్గొన్నారు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >