| Daily భారత్
Logo




గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

News

Posted on 2026-06-27 03:46:30

Share: Share


గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

రాజోలు పోలీసుల సత్వర స్పందనకు ఎస్పీ ప్రశంసలు...

డైలీ భారత్,అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పోలీసుల అప్రమత్తతతో అదృశ్యమైన ముగ్గురు మైనర్ బాలికలను కేవలం గంట వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు వేగంగా స్పందించి బాలికలను క్షేమంగా గుర్తించిన రాజోలు పోలీసులను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ మీనా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

రాజోలు పరిధిలోని నున్నవారి బడువ, అడవివారిపాలెం ప్రాంతాలకు చెందిన 14, 15, 16 ఏళ్ల ముగ్గురు బాలికలు స్నేహితులు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేని వ్యక్తి ఇంటికి వెళ్లిన విషయమై ఒక బాలికను ఆమె తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ముగ్గురూ శుక్రవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఇళ్ల నుంచి వెళ్లిపోయారు.

రాత్రి వరకు వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాత్రి 9.30 గంటల సమయంలో రాజోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే రాజోలు ఎస్‌ఐ పి. మల్లికార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి రాజోలు సెంటర్‌లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా బాలికలు నున్నవారి బడువ వైపు వెళ్లినట్లు గుర్తించి, స్థానికుల సహకారంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు.

పోలీసుల వేగవంతమైన చర్యల ఫలితంగా రాత్రి 10.30 గంటలకల్లా, ఫిర్యాదు అందిన గంటలోనే ముగ్గురు బాలికలను సురక్షితంగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మైనర్ బాలికల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి, అత్యంత వేగంగా స్పందించిన రాజోలు ఎస్‌ఐ పి. మల్లికార్జున రెడ్డి, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ మీనా ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సత్వర స్పందన, కర్తవ్యనిర్వహణ ప్రజల్లో పోలీసులపై మరింత విశ్వాసాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.

తమ పిల్లలను క్షేమంగా గుర్తించి అప్పగించిన రాజోలు పోలీసులకు, అలాగే ప్రత్యేక శ్రద్ధ చూపిన జిల్లా ఎస్పీకి బాలికల తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >