| Daily భారత్
Logo




ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

News

Posted on 2026-06-26 16:03:09

Share: Share


ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

లేకుంటే పిఆర్ కమిషనరేట్ ముట్టడి 

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న

డైలీ భారత్, కామారెడ్డి:  తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు దళిత జర్నలిస్టులంతా ఏకం కావాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలోని దళిత, గిరిజన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న సామాజిక వివక్షతను ఖండిస్తూ, అక్రిడేషన్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, అర్హులైన ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు అక్రిటేషన్ కార్డులు ఇవ్వాలని అన్నారు. 2024 వరకు ఇచ్చినటువంటి కార్డులు కాలం గడిచిపోయి సంవత్సరం పై అయినప్పటికీ  ఇంకా కార్డుల విషయంలో జాప్యం  చేయడం సరికాదని అన్నారు. ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలలో కళాశాలలో 50 శాతం రాయితీ కాకుండా 100% రాయితీ కల్పించాలని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. ఈనెల 28వ తేదీ లోపు ప్రభుత్వం స్పందించి ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని లేదంటే  ఈనెల 29వ తేది సోమవారం రోజున తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్, ఏసీ గార్డ్స్ ప్రాంతంలో గల ఐ & పి ఆర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో అక్రిడిటేషన్ల విషయంలో దళిత, గిరిజన జర్నలిస్ట్ లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అక్రిడిటేషన్ కమిటీలలో ఇతర సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగిస్తూ దళిత, గిరిజనపై వివక్షతను నేటికీ కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ  విధానాన్ని తక్షణమే విరమించాలని, అర్హులైన  ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పించి వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు దళిత, గిరిజన జర్నలిస్ట్ లకు అన్యాయం జరుగుతోందని దళిత, గిరిజన జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్ కమిటీలలో స్థానం కలిగించినప్పుడే దళిత, గిరిజన జర్నలిస్ట్ లకు న్యాయం జరుగుతోందన్నారు. అలాగే దళిత, గిరిజన జర్నలిస్ట్ లకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ ముట్టడి కార్యక్రమానికి దళిత, గిరిజన జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, సామాజిక న్యాయవాదులు తమ మద్దతును ప్రకటించి, పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తెడ్డు సాయిలు, జిల్లా అధ్యక్షులు కుంటొల్ల యాదయ్య, జాయింట్ సెక్రెటరీ పెరుమాళ్ళ రాజు, కిసరి రాజు, జిల్లా సలహాదారులు బి.సాయిలు, రవి నాయక్, రాజలింగం, రవి, ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >