Posted on 2026-06-26 16:39:15
డైలీ భారత్ స్పెషల్:
లంచం సామ్రాజ్యం....
చేతిలో లంచం జారిన క్షణం...
చరిత్ర తలవంచి ఏడుస్తుందని మరచి పోయామా..!
ధర్మం ధరించిన వస్త్రం చినిగితే....
దేశం దిక్కులేని నావవుతుందని మరచి పోయామా..!
లంచం మబ్బులు తొలిగితేనే...
దినకరుడి దివ్య కిరణాలు భూమిని తాకుతాయి అని గుర్తుంచుకో..!
లంచం తీసుకున్న చేయి
ఒక్క మనిషిని కాదు...
తరతరాల భవిష్యత్తును గాయపరుస్తుంది అని గుర్తుంచుకో..!
ఒక పేద తండ్రి...
కూతురి ప్రాణం కాపాడాలని
ఆసుపత్రి గుమ్మం ముందు చేతులు జోడించాడు...
లోపల మాత్రం ముందు లంచం... తర్వాత చికిత్స అన్న చల్లని మాటలు వినిపించాయి...
ఆ రోజు... చనిపోయింది ఒక చిన్నారి కాదు...
మనిషిలో మిగిలిన మానవత్వం..!
సత్యమనే సుగంధంతో...
అవినీతిని అణచివేసి
మనిషిలో నింపుతాం సేవాతత్వం..!
మనసులో మలినం మొలకెత్తిన చోట
మట్టిలో కాదు మనుగడలోనే చీడ పుడుతుందని
మంజుల పత్తిపాటి కలం చెబుతుంది..!
సత్యమే శ్వాసగా...
నిజాయితీయే నడకగా...
న్యాయమే నిత్యసఖిగా నిలిస్తే...
భారతభూమి భవ్యభవితకు
బంగారు బాటలు పరచుకుంటుందని
మంజుల పత్తిపాటి కలం చెబుతుంది..!
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >