| Daily భారత్
Logo




హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

News

Posted on 2026-06-26 16:45:06

Share: Share


హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

దర్జాగా ఫెన్సింగ్ వేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

అధికారులు, పంచాయతీ పాలకవర్గంపై గ్రామస్థుల ఆగ్రహం

డైలీ భారత్, హాజిపల్లి: ఫరూఖ్ నగర్ మండలం లోని హాజిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోంది. గ్రామ కంఠానికి చెందిన స్థలాన్ని శంషాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దర్జాగా కబ్జా చేస్తున్నా అడిగేవారే కరువయ్యారని స్థానికులు మండిపడుతున్నారు.

ప్రైవేట్ భూమి ముసుగులో కబ్జా

సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు గ్రామ కంఠం స్థలానికి ఆనుకుని కొంత పట్టా భూమి ఉంది. దానికి ఫెన్సింగ్ వేసే నెపంతో, పక్కనే ఉన్న  గ్రామ కంఠం భూమిని అందినకాడికి తన స్థలంలో కలిపేసుకుంటూ ఫెన్సింగ్ వేస్తున్నాడు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే "నీకేం సంబంధం?" అంటూ ఎదురుదాడికి దిగుతుండటంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాలకవర్గంపై అనుమానాలు.. స్థానికుల ఆగ్రహం

ఒక స్థానికేతరుడు వచ్చి గ్రామ ప్రజల ఉమ్మడి ఆస్తిని కాజేస్తుంటే.. గ్రామ పాలక వర్గం ఎందుకు మౌనంగా ఉంటున్నారని గ్రామస్థులు నిలదీస్తున్నారు. పాలకవర్గం కిమ్మనకుండా ఉండటం వెనుక ఉన్న అంతర్యమేమిటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి కబ్జాను అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

గతంలో కాపాడిన భూమి మళ్లీ చేతులు మారుతోంది

గతంలోనూ ఇదే భూమి కొందరు వ్యక్తుల అక్రమ ఆధీనంలో ఉండేదని గ్రామస్థులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఎంతో రిస్క్ తీసుకుని, పద్ధతి ప్రకారం ప్రభుత్వ సర్వే చేయించి ఈ స్థలాన్ని కాపాడారని తెలిపారు. ఆ కష్టం మరువక ముందే.. ఇప్పుడు మరో వ్యక్తి వచ్చి ప్రభుత్వ భూమిని చెరబడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే విచారణ జరిపి, ప్రభుత్వ భూమికి సరిహద్దులు నిర్ణయించి, కబ్జాదారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హాజిపల్లి ప్రజలు కోరుతున్నారు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >