| Daily భారత్
Logo




ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

News

Posted on 2026-06-27 15:35:50

Share: Share


ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

డైలీ భారత్, కామారెడ్డి : ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు వారి లక్ష్యాలకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో జిల్లా పరిపాలన ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.

ఈ సందర్బంగా శనివారం ఆర్‌జీయూకేటీ (బాసర్)లో విద్యను అభ్యసిస్తున్న కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని నిఖిత కుటుంబ ఆర్థిక పరిస్థితులను వివరించి విద్యా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కోరుతూ సమర్పించిన వినతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్పందించారు..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తన కార్యాలయంలో విద్యార్థినికి రూ.10,000 విలువైన చెక్కును 

రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందజేశారు. 

ఈ సహాయం పుస్తకాలు, అధ్యయన సామగ్రి, ప్రయాణం తదితర విద్యా అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలో నిలిపివేయకుండా, పట్టుదలతో ఉన్నత విద్యను కొనసాగించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.

విద్యార్థిని నిఖిత జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఆర్థిక సహాయం తన చదువును కొనసాగించేందుకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజన్న, నరసింహులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >