Posted on 2026-09-11 17:11:43
TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఎదులాపురం గోపాలరావు
స్కావెంజర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నిమ్మటూరి లక్ష్మయ్య లు డిమాండ్
సమస్యల పరిష్కారం కోసం meo కార్యాలయం ముందు ధర్నా
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ కం స్కావెంజర్లుగా పనిచేస్తున్న కార్మికులకు జీతాలను పాఠశాల కమిటీ చైర్మన్ లు ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండానేరుగా కార్మికుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఎదులాపురం గోపాలరావు,
స్కావెంజర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నిమ్మటూరి లక్ష్మయ్య లు డిమాండ్ చేసారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం meo కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించి, కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
కార్మికులకు అతి తక్కువ వేతనం చెల్లించడం మూలంగా వారి కుటుంబాలు అర్ధాకలి తో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విధంగా స్వీపర్ కం స్కావెంజర్లను అనుస్కిల్డ్ కార్మికులుగా గుర్తించి 12,000 వేతనం అందించాలని వారు కోరారు.
భద్రతలేని జీవితాలు గడుపుతున్న కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ,వారిని పూర్తి కాలం కార్మికులుగా గుర్తించి చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని వారు కోరారు. పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా meo జుంకిలాల్ ఫోన్ లో కార్మికుల కు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నూనావత్ లక్ష్మణ్, జమలయ్య, మేరీ, రాజమణి, సౌజన్య, శేషమ్మ, రాధిక, కౌసల్య, సత్యవతి, లక్మీ , ఉమారాణి, రాములమ్మ, శాంతి , సోనీ, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >