Posted on 2026-09-11 15:57:20
నిరంతర విద్యుత్ సరఫరాపై ఉన్నతాధికారుల సమీక్ష
డైలీ భారత్, కామారెడ్డి:రాష్ట్రంలో విద్యుత్ సరఫరా తీరును, లోడ్ నిర్వహణను మరింత పటిష్టం చేసే దిశగా టిజిఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు టిజిఎన్పీడీసీఎల్ ఆపరేషన్-1 చీఫ్ ఇంజనీర్అశోక్ కామారెడ్డి ఎస్ఈ సాలియా , డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏఈ అధికారులతో కలిసి భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ పర్యటనలో భాగంగా సబ్ స్టేషన్‌లో ప్రస్తుత విద్యుత్ లోడ్ పరిస్థితిని, ప్రసార తీరును సీఈ అశోక్ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. రాబోయే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని లోడ్ అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.
వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అంతరాయం లేని, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. గ్రిడ్ నిబంధనలకు కట్టుబడి ఉంటూ, సబ్ స్టేషన్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆపరేషన్-1 సీఈ అశోక్ గారితో పాటు కామారెడ్డి సర్కిల్ ఎస్ఈ, డిఈ, ఏడీఈ మరియు ఏఈ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >