Posted on 2026-09-10 15:19:28
విజిలెన్స్ దాడులు ఆపాలని...
రైస్ మిల్ అసోసియేషన్ డిమాండ్...
పాల్గొన్న రాష్ట్ర అసోసియేషన్ మాజీ కార్యదర్శి మోహన్ రెడ్డి
డైలీ భారత్, కామారెడ్డి:తెలంగాణ రాష్ట్రంలో పై గత నెల రోజుల నుండి జరుగుతున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో జరుగుతున్న దాడులు వెంటనే ఆపాలని ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిఎంఆర్ బియ్యం అప్పగించేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద రైస్ పిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహాదరణ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1960 నుంచి రైస్ మిల్లు పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందని 2014 ముందు ప్రభుత్వానికి కావలసిన బియ్యాన్ని మిల్లులోని కొనుగోలు చేసేవారని గుర్తు చేశారు. పుణ్యానికి ధ్యాన్యం ఇస్తే పందికొక్కుల వ్యవహరిస్తున్నారని కొందరు మాట్లాడటం సరికాదని ధాన్యం పేరుతో ఇష్టారాజ్యంగా దాడులు చేస్తూ వెరిఫికేషన్ పేరుతో మిలన్ రణం జైల్లో పెడితే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. 2020 నుంచి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లులలో 74 హెచ్పి ఉన్న బిల్లులను 350 నుండి 400 హెచ్పి వరకు బిల్లులు పెరిగేలా మిషన్లు కంప్రెషర్లు వేయించి ఆర్థిక భారం పెంచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 75 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే కామారెడ్డి జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరకు సీఎంఆర్ చెల్లించాల్సి ఉందని ఫిసికల్ వెరిఫికేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు 2014 నుంచి 2024 వరకు 9.70 కోట్ల దాన్యం మిల్లర్లకు అప్పగిస్తే 9.60 కోట్ల బియ్యం తిరిగి అప్పగించామని కేవలం రెండు శాతం బకాయి కోసం 90 శాతం మందిని వేధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. క్వింటాలకు 67 కిలోల బియ్యం రాదని చెప్పిన వినడం లేదని 67 కిలోల అంశంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని 61 కిలోల వస్తుందని నిరూపిస్తే రైస్ మిల్లర్లు అందరం తప్పైందని ఒప్పుకుంటామని సవాల్ చేశారు.
పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొని ఉంది...
రాష్ట్రంలో రైస్ మిల్లర్ పరిశ్రమ 2002 పోలిస్తే రైస్ మిల్లు పెట్టడానికి ఎవరు ముందుకు రావడంలేదని గతంలో జిల్లాలో 36 కాన్సర్ ఫ్యాక్టరీలు ఉండవని ఆ ఫ్యాక్టరీలో ఆర్థికంగా దెబ్బతిని మూతపడ్డాక రైతులు చెరుకు పండించడం చాలా వరకు తగ్గించారని ఫలితంగా చెరుకు విస్తీర్ణం తగ్గి చక్కర ధరల మాంతం పెరిగాయని గుర్తు చేశారు అదే తరహాలో మిల్లులను ఇబ్బందులకు గురి చేస్తే ఈ పరిశ్రమలు కూడా మూతపడితే రైతు వారికి బదులు కూరగాయలు పండించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అప్పుడు బియ్యం ధరలు ఆకాశాలు అంటే ప్రమాదం ఉందని కూడా సూచించారు ఇది దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైస్ లో పరిశ్రమపై ప్రత్యేకంగా ఆలోచించాలని పడ్డ ఎన్నో కుటుంబాలకు న్యాయం చేయాలని సందర్భంగా గుర్తు చేశారు.
అనంతరం మాజీ అధ్యక్షులు కంచర్ల లింగం మాట్లాడుతూ
రైస్ మిల్లులపై నిర్వహిస్తున్న విజిలెన్స్ దాడులను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పప్పుల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి బకాయి పడ్డ మిల్లులపై విచారణ జరపాలి కానీ, అన్ని మిల్లులపై ఏకపక్షంగా దాడులు చేయడం సరికాదన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించాల్సిన మిల్లింగ్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ధాన్యం కేటాయించిన ప్రభుత్వం నిర్ణీత గడువులోగా బియ్యం తీసుకోవాలని, గోదాముల వద్ద లారీలను వారాల తరబడి నిలిపివేసి ఇబ్బందులకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, కార్మికుల వేతనాలు, రవాణా ఖర్చుల కారణంగా రైస్ మిల్లర్లు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల కారణంగా మిల్లుల నిర్వహణ భారంగా మారిందని, సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కంచర్ల లింగం, మాజీ అధ్యక్షుడు గౌరీ శంకర్, డివిజన్ అధ్యక్షుడు భూమేష్ గుప్తతో పాటు జిల్లాలోని పలువురు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >