| Daily భారత్
Logo




స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

News

Posted on 2026-09-09 14:29:32

Share: Share


స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహెష్,డిసిసి జనరల్ సెక్రెటరీ నిమ్మ విజయకుమార్ రెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పట్ల ప్రవర్తించిన తీరు అత్యంత హేయమైనదని, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్, డిసీసీ జనరల్ సెక్రెటరీ విజయ్ కుమార్ రెడ్డి, మండిపడ్డారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్నారు. శాసనసభ అంటే దేవాలయం లాంటిదని, అలాంటి సభకు పెద్ద అయిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల బీఆర్ఎస్ నేతలు అమానుషంగా, దురుసుగా మాట్లాడటాన్ని సేవాదళ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది కేవలం స్పీకర్ ను అవమానించడం కాదు, తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను, రాజ్యాంగాన్ని అవమానించడమే అని అన్నారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సేవాదళ్ సహించబోదని, బీఆర్ఎస్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర సేవాదళ్ అధిష్టానం నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో,కామారెడ్డి నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు మెహర్ బాబా గౌడ్, కామారెడ్డి సేవాదళ్ టౌన్ అధ్యక్షులు, సుదర్శన్, రాజంపేట మండల సేవాదళ్ అధ్యక్షులు వేణు  చారి ఉన్నారు.

Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >