| Daily భారత్
Logo




బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

News

Posted on 2026-09-08 08:44:38

Share: Share


బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

డైలీ భారత్, స్పెషల్:

బాబు… అని పిలవాలని ఉన్నది…

మన కోసం…

మన పిల్లల భవిష్యత్తు కోసం…

తన ఊపిరినే ఉద్యమంగా మార్చి,

తన చెమట చుక్కలనే

చరిత్రాక్షరాలుగా చెక్కి,

తెలంగాణ గుండె చప్పుడును

ఢిల్లీ గోడల దాకా వినిపించి,

అధికార పీఠాలను కదిలించి,

తెలంగాణ తల్లి ఒడిలో

స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన

ఆ ఉద్యమ శిఖరాన్ని

ఒక్కసారి హత్తుకోవాలని ఉన్నది…!

పల్లె నుంచి పట్నం దాకా

ప్రజల గుండెల్లో పోరాట జ్వాలను రగిలించి,

మలిదశ ఉద్యమాన్ని మహోద్యమంగా మలిచి,

తెలంగాణ జనాన్ని

ఒకే తాటిపై నిలిపిన

ఆ ఉద్యమ జ్వాలను

ఒక్కసారి చూడాలని ఉన్నది…!

మా బతుకులకు బాటలు వేయడం కోసం…

మా భవిష్యత్తుకు వెలుగులు పంచడం కోసం…

తెలంగాణ ఆత్మగౌరవాన్ని

అక్షరమై… ఆశయమై…

ఆకాంక్షమై… ఉద్యమమై మలిచిన

ఆ తెలంగాణ ముద్దుబిడ్డను

ఒక్కసారి దగ్గరగా చూడాలని ఉన్నది…!

తెలంగాణ నేల కోసం…

తెలంగాణ నీటి కోసం…

తెలంగాణ నిధుల కోసం…

తెలంగాణ ఆత్మగౌరవం కోసం…

అలుపెరుగని అడుగులతో,

అవిశ్రాంత పోరాటం చేసిన

ఆ ఉద్యమ ధీరుడి ముందు

ఒక్కసారి నిలిచి

మనసారా హత్తుకోవాలని ఉన్నది…!


బాబు…” అని పిలవాలని ఉన్నది…

ఒక్కసారి కాదు…

గుండె ఉన్నంతకాలం

ఆ పేరునే పలకాలని ఉన్నది…!


రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి.

చరవాణి 9347042218

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >