| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పసికందుకు బంగారు ఉంగరం తొడిగిన సీఎం విజయ్

పసికందుకు బంగారు ఉంగరం తొడిగిన సీఎం విజయ్

డైలీ భారత్ డెస్క్: తమిళనాడు ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పుట్టే శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించే "తాయ్‌మామన్ తంగ మోతిరం" పథకాన్ని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సోమవారం మదురైలో ప్రారంభించారు.

మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం విజయ్ స్వయంగా చిన్నారులకు బంగారు ఉంగరాలు తొడిగారు. ఈ సందర్భంగా ఓ శిశువు వేలికి స్వయంగా ఉంగరం తొడిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ పథకం కింద 2026 జూన్ 22 నుంచి పుట్టిన అర్హత కలిగిన శిశువులకు ఉంగరాలు అందించనున్నారు. పథకం కోసం ప్రభుత్వం తొలి దశలో 1.28 లక్షల బంగారు ఉంగరాలను సిద్ధం చేసినట్లు నివేదికలు.

Previous సిరిసిల్లలో విషాదం - చెరువులో మునిగి ముగ్గురు పిల్లల తండ్రి మృతి
Next సిరిసిల్లలో బీజేపీ vs కాంగ్రెస్... దిష్టిబొమ్మ దహనంపై రచ్చ, రాహుల్, ప్రియాంకపై ఫైర్
ADVERTISEMENT