| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కోడిప్యాక సాయిరాంకు అరుదైన గౌరవం... రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదోన్నతి

కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కోడిప్యాక సాయిరాంకు అరుదైన గౌరవం... రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదోన్నతి

రవీంద్రభారతిలో ఘన సన్మానం

డైలీ భారత్, కామారెడ్డి: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా సమర్థవంతంగా సేవలు అందిస్తున్న కోడిప్యాక సాయిరాంకు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన సాయిరాంను వేదికపై ఘనంగా సన్మానించారు.

తెలంగాణ రాష్ట్ర కమిషనర్ దేశాల భూపాల్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్ చైర్మన్ డా. చంటి ముదిరాజ్, మల్లం వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సుర స్రవంతి తదితరులు పాల్గొని కోడిప్యాక సాయిరాంకు శాలువా కప్పి, మెమెంటో అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో సాయిరాం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.

 #Kamareddy #KodipyakaSairam #RTI #RavindraBharathi #DailyBharat

Previous 33/11మాచారెడ్డి సబ్‌స్టేషన్‌,132 కెవి, 33/11 దోమకొండ సబ్‌స్టేషన్‌లను తనిఖీ చేసిన టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ
Next సిరిసిల్ల టీచర్లకు హైదరాబాద్‌లో టీ-సాట్ శిక్షణ... ప్రశంసాపత్రాల ప్రదానం
ADVERTISEMENT